logo

ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం

వైఎస్ఆర్ సిపి పాలనలో ప్రతి ఇంటా సంతోషం...

సంక్షేమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి...

అభివృద్ధి కి పట్టం కట్టండి... ఆశీర్వదించండి...

ఆదరించండి... ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి..

ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డికి జన నీరాజనాలు పలికిన సంబేపల్లె ...

సంబేపల్లె మండలం సంబేపల్లె గ్రామంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన...

వైఎస్ఆర్ సిపి పాలనలో ప్రతి ఇంటా సంతోషం నెలకొందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శనివారం సంబేపల్లె మండలం సంబేపల్లె గ్రామంలో ఉదయం 6 గంటలకే శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి,ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, మండల నాయకులు వివి ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ అంచల రామచంద్ర, ఎంపిటీసీ భద్రయ్య,మండల జెసి ఎస్ కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి,గొర్ల అనిరుధ్ రెడ్డి,గుండ్రే భువనేశ్వర్ రెడ్డి, అన్నారెడ్డి,కందూరి సురేంద్ర నాయుడు, ఉమా మహేశ్వర నాయుడు లతో కలసి శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

జిల్లా ఏర్పాటు,,, పట్టణ అభివృద్ధికి,,, యువతకు ఉపాధి అవకాశాలు...

ఈరోజు ఎంపీ అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా రాయచోటిలో నామినేషన్లు వేస్తున్నారంటే అది శ్రీకాంత్ రెడ్డి కృషే...

ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డికి అభినందనలు చెబుతున్న గ్రామీణ యువకులు...

రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు పట్టణం అభివృద్ధికి దోహదం చేసింది. ఫలితంగా అనేక చిన్న, పెద్ద పరిశ్రమలు, వ్యాపార కేంద్రాల ఏర్పాటు వలన యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయంటూ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి పట్ల గ్రామీణ యువత హర్షం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రం ఏర్పాటులో మీ కృషి అభినందనీయమంటూ శ్రీకాంత్ రెడ్డి ని ప్రశంసించారు. నూతన జిల్లా ఏర్పాటు వలన హోటల్స్, ఇతర వ్యాపార అభివృద్ధి, విద్యా సంస్థల ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. మీ కృషితో నియోజక వర్గంలో రానున్న రోజుల్లో కృష్ణా జలాల పారుదలతో వ్యవసాయం పండుగలా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహంతో పాడి రైతు కుటుంబాలకు మెండుగా ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. గ్రామీణ యువత ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎంపీ అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా రాయచోటిలో నామినేషన్లు వేస్తున్నారంటే అది శ్రీకాంత్ రెడ్డి కృషేనంటూ అభినందనలు తెలిపారు.

*మహిళలకు జగనన్న ఇచ్చిన హామీలు నెరవేర్చారన్నా...

*డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా వేశారన్నా...

*తమ ఓట్లన్నీ జగనన్నకే అంటూ స్పష్టం చేస్తున్న అక్క చెల్లెమ్మలు...

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జగనన్నకే చెల్లు అంటూ సంబేపల్లె గ్రామ అక్క చెల్లెమ్మలు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఆనందం వ్యక్తం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ ప్రభుత్వ పథకాలను అమలు చేసి కొండంత అండగా నిలబడ్డారన్నారు. చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను మాపీ చేశారన్నారు. చేయూత పథకం ద్వారా తమ ఆర్థికాభివృద్దికి చేయూత నందించారని, తమ ఓట్లు జగనన్న కే అంటూ మహిళలు స్పష్టం చేసారు.చంద్రబాబు పాలనలో మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ పథకానికి మంగళం పాడితే జగనన్న పెద్దమనసుతో ఆ పథకాన్ని అమలు చేశారన్నారు.

*బిసి ల హృదయాలలో జగన్..జగన్ హృదయంలో బిసిలు..

బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అనిసీఎం జగన్ నిరూపించారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఎదుట గ్రామానికి చెందిన వెనుక బడిన వర్గాల ప్రజలు తెలిపారు.మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితో పాటూ వార్డు మెంబర్ల వరకు బీసీ కుటుంబం జన సముద్రంలా ఉండేలా కృషి చేశారన్నారు
82వేలమంది బీసీలు రాజకీయ సాధికారతతో పదవుల్లో ఉన్నారని.. బిసి ల హృదయంలో జగన్.. జగన్ హృదయంలో బిసి లుఉండడం హర్షణీయమన్నారు.వడ్డెరలు ఇద్దరిని సీఎం జగన్ ఎం ఎల్ సి లు గా చేసారంటూ పాండురాజుల బండ, నామాల గుట్ట ప్రాంతాలకు చెందిన వడ్డెరలు శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఆనందం వ్యక్తం చేశారు.

*దళితోద్దారకుడు సీఎం జగన్...

*హరిజన వాడలలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి ఆత్మీయ స్వాగతాలు...

దళితోద్దారకుడు సీఎం జగన్ అని గ్రామంలోని ఇందిరా నగర్ కాలనీ, అంబేద్కర్ కాలనీ ల వాసులు పేర్కొన్నారు. హరిజన వాడలలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డికి ఆత్మీయ స్వాగతాలు లభించాయి. దళితుల మనోభావాలను చంద్రబాబు, లోకేష్ లు దెబ్బతీసారని హరిజన వాడల వాసులు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఎదుట గుర్తు చేసుకున్నారు. గతంలో దళితులలో ఎవరు పుట్టాలని కోరుకుంటారని మాట్లాడారని,ఈ మధ్యన లోకేష్ దళితులు ఏమి పీకుతారని మాట్లాడారని ఆ ప్రాంతాల ప్రజలు గుర్తు చేసుకున్నారు. దళితులను ద్వేషించే వ్యక్తి చంద్రబాబు అని, దళితులను గుండెల్లో పెట్టుకునే వ్యక్తి జగన్ అని దళిత ప్రజలు శ్రీకాంత్ రెడ్డి ఎదుట స్పష్టం చేశారు.

*అక్కున చేర్చుకున్న బొగ్గుల వారిపల్లె...
ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ని బొగ్గులవారిపల్లె ప్రజలు అక్కునచేర్చుకున్నారు.బీసీలను గుండెల్లో పెట్టుకున్న జగన్ కు తోడుగా నిలిచి వైఎస్ఆర్ సిపి ఎంపి అభ్యర్థి మిథున్ రెడ్డి,ఎంఎల్ఏ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి లను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.

*చేనేతకు జగనన్న చేయూత...

*మాధంవాండ్లపల్లె లో ఇంటింటా ఆత్మీయ స్వాగతాలు పలికిన తొగట వీర క్షత్రియులు...

తమకు గత ప్రభుత్వాలు సహకారం అందివ్వక పోగా మగ్గాలను మూలన పడేసామని,జగనన్న అధికారం చేపట్టాక తిరిగి మగ్గాలను నేస్తూ సంతోషంగా జీవిస్తున్నామని ఎంఎల్ఏ ఎదుట మాదంవాండ్లపల్లె చెందిన చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇబ్బందుల పరిస్థితులల్లో కూడా త్రాగునీటి ని అందింస్తున్నారంటూ ఇంటింటా శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఆనందం వ్యక్తం చేశారు.

*సంబేపల్లె గ్రామంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులు...

◆రూ 2.50 కోట్ల నిధులుతో శ్రీ గుహేశ్వరి పశుపతినాధ ఆలయం, శ్రీ నల్లగంగమ్మ తల్లి ఆలయాల పునః నిర్మాణాలు,

◆నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధి,

◆ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి,

◆పల్లె పల్లెనా సిసి రోడ్లు,
ఇందిరా నగర్ కాలనీ లో కల్వర్టు అండ్ డ్రైనేజీ ల నిర్మాణాలు,

◆జగనన్న కాలనీలో వంద పక్కా గృహాల నిర్మాణాలు,

◆మండల కేంద్రమైన సంబేపల్లె లోని జాతీయ రహదారిలో డివైడర్ ఏర్పాటు,

◆గ్రామంలో నూతనంగా విద్యుత్ లైన్లు, అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు,

◆త్రాగునీటి బోర్లు తదితర అభివృద్ధి పనులు జరిగాయి.

ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు తేజ స్కూల్ కరెస్పాండెంట్ విజయ కుమార్ రెడ్డి, నూకల సురేంద్ర, తముకు సిద్దయ్య, గొంగటి రామచంద్ర, నాగమునిరెడ్డి,మోడెం చలపతి, అనంత సిద్దయ్య,మోడెం శ్రీరాములు, భోజనపు రమణ,
వైస్ ఎంపిపి పొత్తూరి రవీంద్ర నాయుడు, సర్పంచులు మోహన్, వెంకట రమణ నాయక్,పాల వెంకట రమణ నాయుడు,బిసి సెల్ నియోజక కన్వీనర్ నాగరాజు యాదవ్, దండు నాగభూషన్ రెడ్డి, పలవలి అమర నాధ రెడ్డి, ఎంపిటిసి లు శ్రీధర్ రెడ్డి, కాకులపల్లె రమణా రెడ్డి మండల వ్యవసాయ సలహా సంఘ అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి, అన్నారెడ్డి, వసంత శ్రీనివాసులు రెడ్డి, మనోజ్ రెడ్డి,
యర్రపురెడ్డి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లికార్జున రెడ్డి,లక్ష్మీకర్ రెడ్డి,శివారెడ్డి వాయల్పాటి ఆనంద్ కుమార్ రెడ్డి, లయన్ అశోక్ రెడ్డి,మోటకట్ల జె సి బి ప్రతాప్ రెడ్డి, భాను మూర్తి రెడ్డి,మధు, రేగడికుంటపల్లె భాస్కర్ రెడ్డి,
డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ బుల్లి వెంకట రమణ,మాజీ ఎంపిటీసీ శివయ్య,కిషోర్ రెడ్డి, మహేశ్వర తదితరులు పాల్గొన్నారు.

0
0 views